Local News

కోనసీమ లో సినీనటి ఆమని సందడి

heroine amani visit konaseema

కోనసీమటుడే తాపేశ్వరం: సినీ నటి ఆమని మండలంలోని తాపేశ్వరం గ్రామంలో గల సురుచి ఫుడ్స్‌లో మంగళవారం సందడి చేసింది. కాజా తయారీ విధానాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆమె రాకతో సురిచిలో సందడి నెలకొంది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి కనబర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నక్కిన త్రినాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా ‘హలో గురూ ప్రేమ కోసం’ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ సరసన నటిస్తున్నానని తెలిపారు. నాలుగు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ ...

Read More »

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం

vadapalli swamy hundi counting

కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకన్నపరకామణి సేవ…!!! కోనసీమ తిరుపతిగా వాడపల్లి లో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయన్ని బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీ అధికారి ఉదయబాబు నాయుడు ఆధ్వర్యం లో లెక్కించారు. 34 రోజులకుగాను రూ.38,36,079లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి తెలిపారు . దీంతో పాటు 6 గ్రాములు బంగారం వెండి 305 గ్రాములు వచ్చింది.

Read More »

అంబాజీపేట మార్కెట్‌ యార్డులº అగ్నిప్రమాదం

Fire Accident in Coconut Market Yard at Ambajipeta

అంబాజీపేట, కోనసీమటుడే : స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని కురిడీ కొబ్బరి కాయల గోదాములో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్తు షార్టు సర్క్యూటే ఇందుకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.   ఈ సంఘటనలో రూ.1.50 కోట్ల మేర ఆస్తినష్టం జరిగిందని అధికారులు ప్రాథ]మికంగా అంచనా వేశారు.  దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మార్కెట్‌ యార్డులోని కొబ్బరి గోదాములో అంబాజీపేటకు చెందిన అప్పన వెంకట్రాజు అండ్‌ బ్రదర్స్‌ కంపెనీ యాజమాని అప్పన వెంకట్రాజు భారీగా కురిడీ కొబ్బరి కాయలను నిల్వ చేశారు. ...

Read More »

రాజోలు ఆర్టీసీ డిపోకు చెందిన నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌

RTC conductor who is honest with the Razole RTC Depot

రాజోలు, కోనసీమటుడే : బస్సులో ఎవరో ప్రయాణికుడు మరిచిపోయిన రూ. లక్ష నగదున్న బ్యాగును భద్రంగా డిపో మేనేజరుకు అందజేయడం ద్వారా తన నిజాయతీని నిరూపించుకున్నాడు రాజోలు ఆర్టీసీ డిపోకు చెందిన ఓ కండక్టర్‌. ఈ సంఘటనకు సంబంధించి డీఎం ఎం.యు.వి.మనోహర్‌ శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 7న రాజోలు నుంచి రాజమహేంద్రవరం వెళ్లిన ఏపీ29 జెడ్‌0194 బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వర్తించిన పి.వెంకన్నబాబుకు బస్సులో ఎవరో ప్రయాణికుడు బ్యాగు మరిచిపోయినట్లు ...

Read More »

NASA SPACE CONTEST లో పాల్గొన్న మన అమలాపురం అమ్మాయి

D.Shiney Amalapuram

కోనసీమటుడే : D.Shiney కి అభినందనలు మరియు అశ్శీసులు తెలియచేసిన S.K.B.R కళాశాల పాలకమండలి సభ్యులు శ్రీ .D.S.N.RAJU గారు. అమెరికాలో ప్రతి సంవత్శరం నిర్వహించే ప్రతిష్టాత్మక ”    NASA SPACE CONTEST “. కి సంబంధించి లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా లో జరిగిన ISDC[International Space Development Conference] Conference లో పాల్గొన్న షైనీ. [SKBR కళాశాల గణిత విభాగాదిపతి & NAVAL NCC ఆఫీసర్, Sub. Lt.Dr.D.Ch.PapaRao గారి అమ్మాయి D.Shiney, 7th Class].  

Read More »

వాడపల్లి వెంకన్నకు మరకతమణి బహూకరణ

marakathamani haram presentation to vadapalli venkanna

కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారికి సోమవారం దాతలు మరకతమణిని బహూకరించారు. కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సోమవారం దాతలు మరకతమణిని బహూకరించారు. రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల ప్లాస్టిక్స్ అధినేత సోమిరెడ్డి వంశీకృష్ణ కుటుంబ సభ్యులు 112 గ్రాముల బంగారు గొలుసుతో కూడిన *మరకతమణి* హారాన్ని శ్రీస్వామి వారికి సమర్పించారు. బంగారం విలువ రూ.3లక్షలు,మరకతమణి విలువ రూ.4.5 లక్షలు వెరసి ఈ ఆభరణం విలువ రూ.7.5 లక్షలు ఉంటుందని దాత తెలిపారు.ఆలయ ఛైర్మన్ కరుటూరి నరసింహారావు, ధర్మకర్తల మండలి ...

Read More »

వాడపల్లి బ్రహ్మాండనాయకునికి నీరా‘జనం’

కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ( Vadapalli Sri Venkateswara Swamy Temple ) ఆత్రేయపురం, కోనసీమటుడే:  ఏడు వారాల నోము ఆచరించే వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడింది. గోవింద నామాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్ర పుష్పం, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకులు శాస్త్రీయంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. రావులపాలెం, ఏలేశ్వరం, గోకవరం తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ర్యాలి ...

Read More »

వాడపల్లి ఆలయాభివృద్ధికి చర్యలు – నాలుగు రాజగోపురాలతో ప్రాకారమండపం

నిత్యం భక్తుల తాకిడితో శోభిల్లుతున్న వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి నూతన శోభ   వివిధ అభివృద్ధి పనులు చేసేందుకు దేవాదాయ ధర్మదాయశాఖాధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశారు. తూర్పు గాలిగోపురానికి అదనంగా రూ.2.70 కోట్లతో ఉత్తర, దక్షిణ, పడమర దిక్కుల్లోనూ అయిదంతస్తుల గాలిగోపురాలతో కూడిన ప్రాకార మండపం నిర్మించనున్నారు. ఆలయం సమీపంలోని పార్కింగ్‌ స్థలం వద్ద రూ.40 లక్షలతో కొత్త శౌచాలయం, గోదావరి ఒడ్డున రూ.30 లక్షలతో కేశఖండనశాల ఏర్పాటు, ఆలయ ఆవరణలో రూ.70 లక్షలతో గ్రానైట్‌తో అభివృద్ధి చేయనున్నారు. శుక్రవారం డీఈ ...

Read More »

మన రాజమండ్రి లో సినీతారల సందడి

KLM Fashion Shopping Mall opening

కోనసీమటుడే : రాజమహేంద్రవరంలో సినీ తారలు సందడి చేశారు. స్థానిక జెఎన్‌ రోడ్డు రామాలయం సెంటర్‌లో కెఎల్‌ఎం ఫ్యాషన్‌ మాల్‌ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి హీరో సాయిధరమ్‌తేజ్‌, హీరోయిన్‌ కేథరిన్‌ హాజరయ్యారు. రిబ్బన్‌ను కట్‌ చేసి మాల్‌ను ప్రారంబించారు. వీరిని చూసేందుకు అభిమానులు షాపింగ్‌ మాల్‌ వద్దకు భారీగా తరలివచ్చారు. వారితో సాయిధరమ్‌తేజ్‌ సెల్ఫీలుదిగి సందడి చేశారు. షాపింగ్‌మాల్‌ను సందర్శించారు. అధునాతన భవనంలో వివిధ ఫ్లోర్‌లలో నేటి యవతను ఆక్టుకునే డిజైన్లతో కెఎల్‌ఎం ఫ్యాషన్‌ మాల్‌ను రూపుదిద్దుకుందన్నారు. అనంతరం ...

Read More »