ఎంత మంది తిన్నారు ఆత్రేయపురం పూతరేకులు….?

పూతరేకులు అనగానే గుర్తొచ్చే  మొదట పేరు అత్రేయపురం .తెల్లదొరలు పోతూ పోతూ పూతరేకులని పేపర్ స్వీట్ అనేసి పోయారు కానీ ఇది పేపర్ స్వీట్ మాత్రమే కాదు, పేపర్లలో చాలా గొప్పగా చెప్పిన స్వీట్.

Pootharekulu is a popular sweet from atreyapuram, East Godavari, India.

పూతరేకులు ఆంధ్రప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధ మిఠాయిలు. కొన్ని ప్రాంతాలలో వీటిని పొరచుట్టలు అని కూడా పిలుస్తారు. పూతరేకులు చేయడం ఒక కళగా భావిస్తారు. ఈ కళ కేవలం తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. జిల్లాలోని ఆత్రేయపురం మండలం గురించి మరేవిధంగా తెలియక పోయినా పూతరేకుల పరంగా ఈ మండలం బహుప్రసిద్ధం. ఈ మండల పరిధిలోని గ్రామాలు పూతరేకుల తయారీతో కళకళ లాడుతుంటాయి. పూతరేకులు మరికొన్ని చోట్ల తయారు చేయబడుతున్నా వీరు మాత్రమే ఈ కళలో నిష్ణాతులు. వీరి చేతిలోనే వాటి అసలు రుచి.

పూతరేకులు History

పూతరేకుల పుట్టుక బహు విచిత్రం. ఒక వృద్దురాలు వంటచేసే సమయంలో ఆమెకు కలిగిన ఊహకు రూపం పూతరేకు. తదనంతరం దానిని మరింత అభివృద్ధి పరచి ఎన్నో విధములైన పూతరేకులను సృష్టించారు.

making of pootharekulu

Making of పూతరేకులు

పూతరేకులు తినగానే అబ్బా చాలాబావున్నాయి అనుకుంటాం, కానీ చెయ్యడం ఎంత కష్టమో ఒకసారి చూద్దాం. పూతరేకులకి బియ్యం పిండిని వాడతారు..ఏ బియ్యం పడితే ఆ బియ్యం వాడరు “జయా రకం” బియ్యం మాత్రమే వాడతారు.

ముందు బియ్యాన్ని నీళ్ళలో నానపెట్టి ఓ మూడు గంటలు ఉంచి తర్వాత గ్రైండ్ చేస్తారు.. బాగా నీళ్ళు పోసి పలుచగా చేస్తారు పిండిని .ఇప్పుడు ఒక కుండని కట్టెలపొయ్యిమీద బోర్లించి పెడతారు.. ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకుని దీర్ఘచతురస్రాకారం లో కట్ చేసుకుని అప్పుడు ఆ క్లాత్ ని పిండిలో ముంచి కుండమీద వేస్తారు..అలా రేకులుగా వస్తాయి ఆ రేకులని ఒక్కొక్కటిగా తీసి అందులో బెల్లం పొడి,నెయ్యి వేసి మడతపెడతారు. వీటిని పూతరేకు చుట్టలుగా పిలుస్తారు..పంచదారపొడి వేసికూడా చేస్తారు ..

Making of Pootharekulu Paper

అలాగే జీడిపప్పు, బాదం పప్పు వేసి మరీ చుడతారు వాటి టేస్ట్ బావుంటుంది..మారుతున్న కాలానికి తగ్గట్టు తయారీదారులు కూడా తినేవారికి నచ్చేటట్టు చెయ్యడం ఆత్రేయపురం పూతరేకుల తయారీదారుల స్పెషాలిటీ.

డయాబెటిస్ ఉండి అయినా పూతరేకులమీద మమకారం ఉన్నవారికోసం సుగర్ ఫ్రీ పూతరేకులని అందుబాటులోకి తెచ్చారు. దేశవిదేశాల్లో ఈ ఆత్రేయపురం పూతరేకులకి చాలా డిమాండ్ ఉంది పెళ్ళిళ్ళకి మాత్రమే కాదు మిగిలిన శుభకార్యాలకి ఆర్డర్స్ బాగా వస్తాయి ఈ అత్రేయపురానికి.

different types of putharekulu

పూతరేకులని చుట్టడం వచ్చిన న్వాళ్ళు కేవలం ఉత్తి రేకులనే కొంటారు అలా కావలన్నా రేకులని ఆత్రేయపురం లో విడిగా అమ్ముతారు. గురజాడ అప్పారావుగారు చెప్పినట్టు ప్రపంచం లో ప్రతీదేశం లోనూ మనవాళ్ళున్నారన్నట్టే ప్రతీవారికీ ఆత్రేయపురం పూతరేకులూ తెలిసిపోయాయి.

Varieties of Pootharekulu : Pootharekulu can be stuffed with different items such as fine powdered sugar, jaggery, dry fruits, chocolate powders,Hot Pootharekulu, Kova Pootharekulu,  etc. For diabetic people Pootharekulu is available with artificial sugars of less calorific value.

ఆత్రేయపురం పూతరేకులకే కాదు మావిడితాండ్రకీ  ప్రసిద్ధి .. వేసవికాలం లో మావిడితాండ్రని తయారు చేస్తారు.. పూతరేకులని 365 రోజులూ తయారు చేస్తారు.

Making of Mamiditandra

ఆత్రేయపురం పూతరేకులకే కాదు తాటి తాండ్రకీ  ప్రసిద్ధి .. వేసవికాలం లో తాటి తాండ్రని తయారు చేస్తారు.. పూతరేకులని 365 రోజులూ తయారు చేస్తారు.

 

 

ఈరోజుకీ కేవలం పూతరేకులకోసం ఆత్రేయపురం వెళ్ళికొనుక్కునేవారు ఉన్నారు. ఈ ఆత్రేయపురం తూర్పుగోదావరి జిల్లాలోని ఒక మండలకేంద్రం..

ఆంధ్రప్రదేశ్ లోనితూర్పు గోదావరిజిల్లాలోని మరో కీర్తికిరీటం ఈ ఆత్రేయపురం పూతరేకులు.