గోదావరి ఫేమస్ ఫుడ్ అంబాజీపేట పొట్టెక్కలు….

మీకు తెలుసా : వీలయితే ఓసారి మా అంబాజీపేట రండి . ఇక్కడ పొట్టిక్కలు తినండి ఫేమస్. కారప్పొడి, నెయ్యి, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, దబ్బకాయ చట్నీలతో నంజుకొని పొట్టిక్కలు తింటే… ఆ రుచే వేరు… అబ్బ….దాని రుచి అదుర్స్

Ambajipeta potekalu

మన సంప్రదాయ వంటలకు పెట్టింది పేరు తూర్పు గోదావరి. అలాంటి తూర్పు గోదావరి లో ఒక్కొక్క ప్రాంతం కి ఒకొక్క ఫేమస్ ఫుడ్ వుంది. అందులో అంబాజీపేట లో పొట్టెక్కలు కూడా ఒకటి దీని రుచి చేసిన వారు జీవితం లో మర్చిపొరు యెందుకంటే ఇవి అంత రుచిగా ఉంటాయి కాబట్టి. దీనిని రుచి చేయడానికి రక రకాల ఊరుల నుంచి భోజన ప్రియులు ఎన్నో కిలో మీట్ర్లు నుంచి మరీ వస్తారు.

అసలు ఈ పొట్టెక్కలు అంత ఫేమస్ ఎందుకు అయ్యాయో చూద్దాం .

ఈ పొట్టేక్కలని పనస ఆకులను ఒక చిన్ని బుట్టగా తయారు చేసి అందులొ ఇడ్లీ పిండి వేసి నీటి ఆవిరితో వీటిని ఉడికిస్తారు (కొంతమంది అరటి ఆకులలొ ఉడికిస్తారు ). పనస ఆకులలొ వీటిని ఉండికించడం వలన వీటి రుచి ఇంకా పెరిగిపోతుంది అంతే కాదు మన శరీరం ఎప్పుడూ కూల్ గా ఉంటుంది. దీనివల్ల పొట్టెకాలు రుచికి అరోగ్యం కి కుడా చాలా మంచిది.

వీటిని చూస్తుంటే ఇడ్లీ లాగా కనిపిస్తున్నాయి అనుకోకండి ఇది పూర్తి గా ఇడ్లీ రుచి కి భిన్నంగా ఉంటుంది.