కోనసీమ బ్రాండ్ – ARTOS కూల్ డ్రింక్

కోనసీమ బ్రాండ్ – ARTOS కూల్ డ్రింక్

రామచంద్రపురం కి చెందిన  పక్కా లోకల్ కూల్ డ్రింక్ ..ఒకసారి తాగితే ఇక ఈ కూల్ డ్రింక్ కి ఫిక్స్ అవ్వాల్సిందే అనిపించే టేస్ట్ ARTOS బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్ ARTOS కే సొంతం…

ఏ కూల్ డ్రింక్ టేస్ట్ దానికదే ప్రత్యేకంగా ఉంటుంది ఆర్టోస్ టేస్ట్ కూడా అలా ప్రత్యేకంగానే ఉంటుంది. కాని ఇది మన తెలుగు వారి సంస్థ కావడంతో Artosపై మన వారికి అభిమానం మరింత పెరిగింది. ప్రస్తుతం ఇది కేవలం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలో మాత్రమే దొరుకుతుంది ఐనా కూడా మంచి బిజినెస్ జరుగుతూ కోట్లల్లో టర్నోవర్ సాధిస్తుంది. మీరెప్పుడైనా మా వైపు వెళ్తే టేస్ట్ చూసేయండి మరి…

ముందు ఈ కూల్ డ్రింక్ చరిత్ర తెలుసుకుందాం.. 

100-year-old Artos in expansion mode

1912లో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న రోజులలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చాలామంది బ్రిటీష్ సైన్యం వచ్చేవారు. అలసిపోయిన సైన్యానికి గోలిసోడాలు అమ్మేవారు అక్కడ ఉండే అడ్డూరి రామచంద్ర రాజు గారు. వారు సైన్యంతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగించేవారు. ఆ బంధంతో ఇంగ్లాండ్ నుండి కూల్ డ్రింక్స్ తయారు చేసే మిషిన్స్ ను దిగుమతి చేసుకున్నారు. మొదట 1919లో ఏ.ఆర్.రాజు అనే పేరుతో డ్రింక్స్ అమ్మారు. ఆ తర్వాత 1955లో “ఆర్టోస్” గా పేరు మార్చారు. అప్పట్లో దీనినే ‘రాజు గారి కలర్ కాయ్’ అని ప్రజలు ముద్దుగా పిలుచుకునే వారు. అప్పటి వరకు నిమ్మరసం, గోలిసోడాలు తాగుతున్న వారికి ఈ డ్రింక్ టేస్ట్ కొత్తగా అనిపించింది, ఇంకా గోదావరి జిల్లాలో ఉండే కొబ్బరి బొండాలు, గోదావరమ్మ నీళ్ళ లాగే ఈ Artos లోని రుచి నచ్చడంతో మంచి సక్సెస్ అయ్యింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సక్సెస్ పరంపర అలా కొనసాగుతూనే ఉంది.

ARTOS అమ్మేది లేదు..

ఆర్టోస్(1955) తర్వాత మనదేశంలో చాలా రకాల కూల్ డ్రింక్స్ వచ్చేశాయి. వాటిలో చాలా వాటిని ‘కోక్’ కంపెనీ కొనేసింది. కోక్ కంపెని మన ఆర్టోస్ కంపెనీని కూడా కొనేసి బ్రాండ్ నేమ్, టేస్ట్ మార్చెద్దామని అనుకుంది కాని రామచంద్ర రాజు గారు దానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత పోటీ ఎక్కువైనా గాని మిగిలిన వాటి కన్నా తక్కువ ధరకే కేవలం 5రూపాయల కన్నా తక్కువ ధరకే అమ్మేవారు. అలా తక్కువ ధరకే అమ్ముతూ ఇప్పటికి మిగిలిన కూల్ డ్రింక్స్ పోటీని బలంగా ఎదుర్కుంటు ముందుకు సాగుతున్నారు.

మీరు.. మీ సాఫ్ట్ డ్రింక్ ని ఎలా మార్కెట్ చేస్తారని అడిగితే యాజమాన్యం ఇలా చెప్పారు..

మేము పెద్ద పెద్ద షాప్స్, Towns మీద దృష్టి పెట్టకుండా ముందు చిన్న షాపులు, గ్రామాలపై దృష్టి పెట్టాం.ముందే లాభాలని ఆశించకుండా షాపు వాళ్లకు ఎక్కువ మార్జిన్లు ఆఫర్ చేశాం. దీంతో గ్రామాల్లో కూల్‌డ్రింక్ అంటే ఆర్టోస్ అని అందరూ అనుకునేలా కష్టమర్స్ కి దగ్గరయ్యాం. పెద్ద పెద్ద కంపెనీలు సైతం అందించని ద్రాక్ష ఫ్లేవర్‌కూడా మా ఆర్టోస్ అందిస్తుంది అని గర్వం గా చెప్తూ, మిగతా కంపెనీలు చిన్న బాటిల్‌ను రూ.10కి అమ్ముతుంటే మేము ఆర్టోస్ ని రూ.8కే ఇస్తున్నాం.. ఇలా చెయ్యడం వల్ల మా వ్యాపారమూ పెరిగింది టర్నోవర్ కూడా కోట్లలో ఉంది అని చెప్పారు ARTOS యాజమాన్యం.

కూల్ డ్రింక్‌లతో పాటు సోడా, మంచినీటి వ్యాపారంలోకి కూడా ఆర్టోస్ ప్రవేశించిందని సంతోషం గా చెప్పే జగన్నాథ వర్మ రామచంద్రరాజు కుటుంబంలో మూడో తరానికి చెందినవారు , వీరభద్రరాజు, పద్మనాభవర్మతో కలిసి ఈయన ఆర్టోస్‌ను నిర్వహిస్తున్నారు.ఈరోజుకీ ఎంతో ఆదరణ ఉన్న ఈ ARTOS కూల్ డ్రింక్ గోదావరి జిల్లాల ప్రజలకి ఎంతో ఇష్టమైన సాఫ్ట్ డ్రింక్…