అయినవిల్లి స్ధలచరిత్ర

Sri Vighneswara Swamy Devasthanam

Sri Vighneswara Swamy Devasthanam

స్వయంభూగణపతి క్షేత్రాలలో అయినవిల్లి ఒకటి. దక్షిణాంధ్రాలో కాణిపాకం ప్రసిద్ధి చెందినట్ట్లు ఉత్తరాంధ్రలో అయినవల్లి ప్రసిద్ధి చెందింది. అయితే, కాణిపాకంలో ని వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రత్యేకం ఉంటే అయినవిల్లి లోని సిద్ధి వినాయకుని ఆలయం ఒక ఆలయ సముదాయంలో ఉంది.

కృతయగం నుండే నెలకొనిఉన్నట్ట్లుగా చెప్పబడుతున్న ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. అతి ప్రాచీనమైన ఈ క్షేత్రాన్ని స్వయంభూగణపతిని , ప్రాంగణంలోని యితర ఆలయాలను మీ ముందుంచుతున్నాము .

క్షేత్రప్రాచీనత అయినవిల్లి క్షేత్రం ఏ పురాణంలోనూ ప్రసావించబడలేదు. ప్రాచీన సాహిత్యంలో కూడా యీ క్షేత్రప్రస్తావన కనబడదు కానీ, 14వ శతాబ్దిలో శంకరభట్టుచే సంస్కృతంలో వ్రాయబడిన శ్రీ పాద శ్రీ వలభ చరిత్రలోను , దీనికి తెలుగు అనువాదమైన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో యీ క్షేత్రం ప్రస్తావించబడింది.క్రీ.శ.1320లో జన్మించిన శ్రీపాద శ్రీవల్లభుల మాతామహులు మల్లాది బాపన్నావధానులు.

వారి కాలంలో అయినవిల్లి లో స్వర్ణగణపతి మహాయజ్ఞం జరిగినట్లు శాస్త్ర ప్రకారం చివరి హోమంలో ఆహుతులను గణపతి తన తొండంతో అందుకోవాలని, గణపతి స్వర్ణమయకాంతులతో దర్శనం యివ్వాలని కొందరు పండితులు వాదించినట్టు, యజ్ఞంతంలో గణపతి అదే విధంగా దర్శనమిచ్చి ఆహుతులను స్వీకరించినట్లు, అనంతరం కొద్దికాలంలోనే భాద్రపద శుద్ధ చవితినాడు తాను దత్తావతారుడైన శ్రీ పాద శ్రీవల్లభునిగా అవతరిస్తునట్లు తెలియజేశాడని శ్రీపాదశ్రీవల్లభ చరిత్ర లోని చెప్పబడింది.

 

Address :

SRI VIGHNESWARA SWAMY DEVASTHANAM

The Executive Officer
Sri Vighneswara Swamy Devasthanam
AINAVILLI – 533211
East Godavari District

Phone No: 08856-225812, 9490225812

Email Id: eoainavilli@gmail.com

Website: www.ainavillivighneswara.com, www.svstemple.com

Leave a Reply

Your email address will not be published.