శ్రీ బాలయోగీశ్వర మందిరం ముమ్మిడివరం గ్రామం. తూ.గో.జిల్లా.

కోనసీమలో దర్శించవలసిన దివ్య క్షేత్రాలు – శ్రీ బాలయోగీశ్వర మందిరం ముమ్మిడివరం గ్రామం. తూ.గో.జిల్లా.

sri balayogi swamy temple in mummidivaram

Sri Balayogi Swamy Temple in Mummidivaram

History About Balayogi Temple Mummidivaram

1952 సంవత్సర ప్రాంతం లో ముమ్మిడివరం లో శ్రీ బాలయోగి మౌనముద్రలో ఉంటూ ధ్యానసమాధి స్తితికి చేరుకుని అన్నపానాలు విసర్జించి తాపసి గా ఉండేవారు. బాలయోగీ వారిని భక్తులు దైవస్వరుపుని గా పూజించారు . 


అదే సమయాన జిల్లాలో ఉన్నతాధికారిగా పనిచేసే న శ్రీ బాలకృష్ణ అయ్యర్ గారు శ్రీ బాలయోగిని దర్శించి, అతని తపోదీక్షకు ఆశ్చర్య పోయి బాలయోగి భక్తునిగా మారి బాలయోగికి మందిరం నిర్మించ కృషిచేశారు. బాలయోగి వారికి తపోభంగము కాకుండా మందిర ద్వారాలు ముసి తాళాలు వేసి సీళ్లు వేసేరు.

Balayogi Temple Mummidivaram

Balayogi Temple Mummidivaram

ఆసీళ్ళను ప్రతి సంవత్సరము శివరాత్రి మరునాడు తీసి భక్తులకు దర్శనం ఇచ్చ్హేవారు ,తరువాత రోజున మరలా మందిరానికి తాళాలు వేసేవారు.బాలయోగి దర్సనం ఇచ్చిన రోజున యోగ సమాధి స్థితిలోనే భక్తులకు దర్శనం ఇచ్చేవారు ఎవరితోనూ మాట్లాడుట, కదలికలు ఉండేవి కావు 


శ్రీ బాలకృష్ణ అయ్యారు తమిళనాడు లో బాలయోగి వారికి ప్రాచుర్యం వచ్చేలా ప్రచారం చేసిన కారణం గా ఆరోజులలు శివరాత్రికి బాలయోగి వారి దర్శనానికి ,ఇక్కడ జరిగే తీర్తానికి వందల సంఖ్యలో తమిలనాడు నుండి అసంఖ్యాక భక్తులు ముమ్మిడివరం వచ్చి బాలయోగి వారి దర్శనాన్ని చేసేవారు.

స్తానికం గా కుడా వేలాది భక్తులు బాలయోగి వారిని దైవ సమానునిగా కొలిచేవారు. మామూలు మామూలు బాబాలవలె భక్తులను ప్రలోభాపెట్టుట ,వారితో సంభాషించుట కానీ చేసేవారుకాదు. బాలయోగి వారిని ఇప్పటికి దైవాంశ సంభూతునిగా ఈ ప్రాంత భక్తులు కొలుస్తారు. 


1984 వ సంవత్సరంలో బాలయోగి సిద్ది పొందినట్లు నిర్వాహకులు ప్రకటించిణారట. ఆప్పటి నుండి శివరాత్రి కి జరుపు కార్యక్రమాలు ఆగిపోయినవి. అయినా భక్తులు మామూలు రోజుల లోను, శివరాత్రి నాడుకూడా బాలయోగి మందిరము దర్శించి అక్కడ ఏర్పాటు చేయబడిన బాలయోగి చాయాచిత్రము, ఇతర దేవతా మూర్తులను కొలచి వస్తుంటారు.
ఇప్పటికి బాలయోగి వారి మందిరమును సందర్శిస్తే అనిర్వచనీయ మైన భక్తీ భావం కలుగుతుంది 

balayogi parents in mummidivaram

balayogi parents in mummidivaram


సుమారు 40 సంవత్సరాలు దివ్య క్షేత్రం గా ఆధ్యాత్మిక క్షేత్రం గా వెలుగొందిన ఈ క్షేత్రం సర్వులకు దర్శనీయ క్షేత్రము.


కాకినాడనుండి,యానం, చించినాడ బ్రిడ్జ్ మీదుగా ముమ్మిడివరం లోని బాలయోగీంద్రుల మందిరము చేరవచ్చును 40 కి.మీ. దూరము. బస్సు సౌకర్యము కలదు. అమలాపురం నుండి 12 కి.మీ దూరములో ముమ్మిడివరము చేరుకొనవచ్చును

 ఈ ప్రాంతం సందర్శించు భక్తులు ముమ్మిడివరం బాలయోగీంద్రుల మందిరం దర్శించి, ఆధ్యాత్మిక భావాలతో పునీతులుకండి.