శివకోటి (శివకోడు) : గ్రామంలో వెలిసిన శ్రీఉమాశివలింగేశ్వరస్వామి ఆలయచరిత్ర

కోనసీమలో దర్శించవలసిన దివ్య క్షేత్రాలు

శ్రీ శివకోటి ఉమా శివలింగేశ్వర స్వామీ దేవాలయం – శివకోడు గ్రామం .రాజోలు మండలం . తూ.గో.జిల్లా
త్రేతా యుగంలో రావణ బ్రహ్మను సంహరించి, బ్రాహ్మణుని చంపినా పాపము బాపుకోనుటకుశ్రీ రామచంద్ర మూర్త కోటి శివలింగము లను ప్రతిష్టించెనట. ఈ శివకోడు గ్రామములో ప్రతిష్టించిన శ్రీ ఉమా శివలింగేశ్వరుని ప్రతిష్ట చివరిదని స్థల పురాణము వలన తెలియుచున్నది. ఈ శివలింగము కొట వది కాబట్టి ఈ గ్రామమునకు శివకోటి గ్రామముగా వాసికెక్కినది,

Sivakoti Sri Uma Sivalingeswara Swamy Temple Sivakodu

కాలక్రమేణా శివకోడుగా నామాంతరము పొందినది.
శ్రీ రాముని పాద స్పర్శ తో పులకించి, పునీతమై , పరవశించిన ప్రాంతము శివకోడు గ్రామము,
శ్రీ రామచంద్ర మూర్తి చే ప్రతిష్టించ బడిన ఈ శివ లింగము ద్విస్వరూపాలు కలిగిన అర్ద నాదీశ్వర లింగము,శివలిం గము వేనుక కాళీయుని మర్దిస్తున్న శ్రీ కృష్ణుని రూపము కనిపిస్తుంది . శివలింగ శీర్ష మునండి గంగా జలము బొట్టు,బొట్టు గా కారుతూ కనిపిస్తుంది. 

అతి సుందరముగా నగిషీ లతో మండపాలు ,గోపురాలూ తీర్చి దిద్ద బడిన అతి సుందరమైన శివాలయము శ్రీ శివకోటి శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామీ దివ్య ఆలయము.

Sivalingeswara Swamy Temple Sivakodu

Sivalingeswara Swamy Temple Sivakodu

స్వామిని దర్శించ గానే భక్తుల మనసు అనిర్వచనీయమైన ఆనందపారవష్యము తో ,భక్తీ భావముతో పులకించి పోతుంది.
ఎందరో మహారాజులు,సంస్థానాదీశులు ఈ స్వామిని దర్శించి, సేవించి, స్వామికి అనేకానేక కానుకలు సమర్పించినట్లు స్థల పురాణము వలన తెలియుచున్నది.
అనేక జన్మలలో చేసిన పాపము స్వామీ ని సేవిస్తే హరిస్తుందని,ఇష్ట కామ్యార్ధ సిద్ది కలుగుతుందని భక్తుల విశ్వాసము.
మహాశివరాత్రి పర్వదినాన ,కార్తీక మాసం లోను శివలింగేశ్వర స్వామీ వారికి విశేష పూజలు, అభిషేకాలు, వైభవం గా ఉత్సవాలు జరుగుతాయి.


గోదావరి నదీ పాయలైన వశిష్ట ,వైనతేయ చీరలా కట్టుకుని సింగారించి, ఒకప్రక్కన బంగాళాఖాతం, మధ్యలో వరి చెలు,కొబ్బరి, పనస మామిడి తోటలతో ప్రక్రుతి పచ్చగా పరవశించే ప్రక్రుతి రమణీయతకు మరోపేరు శివకోడు.


ఈ క్షేత్ర సందర్శనతో మన శరీరం భక్తీ భావముతో పులకిస్తు, ప్రక్రుతి ఒడిలో పరవశించి పోతుంది. పుడితే మరు జన్మలో ఇక్కడేపుట్టి ప్రక్రుతి ఒడిలో పరవశించి, పొంగిపోవాలి అనే భావన మనకు తప్పక కలుగుతుంది.శివకోడు గ్రామము రాజోలు నకు సమీప గ్రామము . మహాత్మా గాంధీ సందర్శించిన గ్రామము.

 ప్రాంతము సందర్శించు భక్తులు శివకోడు గ్రామములో వెలసిన శ్రీ శివకోటి శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామిని దర్శించి, అర్చించి, ఇక్కడి ప్రకృతిని ఆశ్వాదించి పులకించి తరించండి.