శ్రీ సుబ్బాలమ్మ వారి దేవాలయం . అమలాపురం .తూ.గో.జిల్లా.

కోనసీమలో దర్శించవలసిన దివ్య క్షేత్రాలు శ్రీ సుబ్బాలమ్మ వారి దేవాలయం . అమలాపురం .తూ.గో.జిల్లా.

Sri Subbalamma Temple Amalapuram

చరిత్ర : 

అమలాపురం పట్టణం గ్రామ దేవత సుబ్బలమ్మ తల్లి..

అమలాపురం పట్టణం లో ప్రస్తుతము కుమ్మరి కాలువగా పిలువబడుచున్న కుమారీ నది ప్రక్కన ఉన్న స్మశాన వాటికను చేరి సుబ్బాలమ్మ వారి ఆలయం పూర్వకాలం లో ఉండేదట, ఇప్పటికీ ఆలయం స్మశాన వాటిక ప్రక్కనే కలదు. కానీ సుమారు 150 సంవత్సరాలకు పూర్వం అమ్మవారు ఒక భక్తుని కల లోనికి వచ్చి మర్నాడు తన గ్రామోత్సవం చేస్తున్నప్పుడు పల్లకీ పడి పోయి పల్లకీ కోడు ఎక్కడ విరుగుతుందో అక్కడ తనకు నూతనం గా ఆలయం నిర్మించమని ఆదేశించినదట. అలాగుననే మరునాడు గ్రామోత్సవం లో ఈ సంఘటన బంగారు వర్తకుల దుకాణాలున్న చోట నిజంగానే జరుగగా భక్తులు శ్రీ సుబ్బాలమ్మ వారి దేవాలయము అక్కడే నూతనముగా నిర్మించినారట.అప్పటినించీ నేటివరకు అమలాపురం లో గ్రామదేవత గా శ్రీ సుబ్బాలమ్మ వారు భక్తుల పూజలందుకోను చున్నది. 


అమలాపురం ప్రజలకు సర్వవిధాలా రక్షణ కలిగిస్తూ ,వారి జీవితాలు ఆనందదాయకంగా ఉండేలా శ్రీ సుబ్బాలమ్మ తల్లి కాపాడుతుందని , వివాహాలు , ఇతర శుభ కార్యాలు, ప్రారంభించేముందు, శుభ కార్యాలు నిర్విఘ్నం గా పూర్తీ అయిన తరువాత భక్తులు శ్రీ సుబ్బాలమ్మ వారిని తప్పక దర్శించి, అర్చిస్తారు.శుభకార్యానికి ముందు అమ్మవారిని కొలిచి మొక్కుబడులు తీర్చి అమ్మవారి చెంతనే కంసాలి నుండి తాళిబొట్లు తీసుకుని వివాహానికి వెళతారు.


వివాహమైన నూతన వధూవరులు శ్రీ సుబ్బాలమ్మ వారిని తప్పక దర్శించి మొక్కుబడులు చెల్లించి ,అర్చించి వేళతారు. సమాచార సేకరణకు నేను వెళ్ళినప్పుడు నూతన వధూవరుల మూడు జంటలు అమ్మవారిని దర్శించి వెళ్ళేరు.దేవాలయం భక్తులతో చాలా రద్దీ గా ఉన్నది. ఆలయం ఉన్న వీధి ని దేవాగుల వీధి అంటారు .


శ్రీ సుబ్బాలమ్మ వారి జాతర ఉగాది పండుగనాడు అతి వైభవం గా నిర్వహిస్తారు.తీర్థం జరుగుతుంది.అమ్మవారికి కుంకుమ అర్చనలు ప్రతి నిత్యం ,మరియు మంగళ ,శుక్ర వారాలలో భక్తులు చే విశేషం గా జరుగుతాయి. 


అమలాపురం పట్టణ ప్రజలు శ్రీ సుబ్బాలమ్మ వారిని బాగా శక్తి వంతురాలైన గ్రామదేవతగా తరాలు తరబడి భక్తీ శ్రద్ధ లతో కొలుస్తున్నారు.
ఆలయం చుట్టు ప్రక్కల మార్వాడీ కుటుంబాలవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారు అమ్మవారిని భక్తీ శ్రద్దలతో పుజిస్తారు.

 

జై సుబ్బలమ్మా తల్లి… జై సుబ్బలమ్మా తల్లి… జై సుబ్బలమ్మా తల్లి… జై సుబ్బలమ్మా తల్లి… జై సుబ్బలమ్మా తల్లి…