శ్రీ ఉమాకోప్పూలింగేశ్వర స్వామి ఆలయం. పలివెల గ్రామం

కోనసీమ లో దర్శించవలసిన దివ్య క్షేత్రాలు

Sri Uma Koppeswara Swamy

శ్రీ ఉమాకోప్పూలింగేశ్వర స్వామి ఆలయం. పలివెల గ్రామం

చరిత్ర :
11వ శతాబ్దం లో రాజమహే0ద్రవరం(రాజమంద్రి) రాజధానిగా పరిపాలించిన రాజరాజనరేంద్రూని కాలంలో నిర్మింపబడిన ప్రాఛీన ఆలయమని
పేద్డలు చేపుతారు. పూర్వం ఈ గ్రామం పల్లవ పురం గాపలువబడేదట.కాలక్రమేనా పలివెల గా నామా0తర0 చందినది.

Sri Uma Koppeswara Swamy palivela

ఆది కాలంలో అఘస్తేశ్వర స్వామిగా భక్తూలచే ఆరాధించబడిన స్వామి నేడు ఉమాకోప్పూ లింగేశ్వరునిగా పూజలందు కోను చున్నారు. పూర్వ0 శివలింగానికి కోప్పూ ఉండేది కాదని,మహారాజు స్వామిని ఆరాధిస్తుంటే కేశమోకటి శివలింగం పై కనబడితే రాజుగారు ఇదేమిటని పూజారిని ప్రశ్నిస్తే స్వామికి కోప్పూ ఉన్నదని ఆకేశము కోప్పూనుండి జారినదని జవాబు చేప్పగా రాజు గారు మరునాడు ఈవిషయము నిరూపించమనగా,పూజారి శివని ప్రార్ధింఛగా కోప్పూతో నున్న శివలింగము గా నాటినుండీ దర్సనం ఇస్తూన్నటల చేపు తారు.

శ్రీ ఉమాకోప్పూలింగేశ్వర స్వామి కోలువై ఉన్న ఈదేవాలయం కోత్తపేటకు 3 కి.మీదురం లో ఉన్నది.రాజమంద్రీ అమలాపురం బస్సూలలో ఈగ్రామం చేరుకోవఛు.

Sri Uma Koppeswara Swamy palivela


భక్తూల ను సంకట హరుని గా కాపాడు తాడని భక్తూల విశ్వాసం

దేవాలయానికి 11సార్లూ ప్రదక్షణలు వంతున 11 రోజులు చేసి ఉమాకోప్పూలింగేశ్వరునికి ఏకాదశరుద్రాభిషీకం చేసుకుంటే చింతలు.సర్వ సంకటాలూ తోలగి పోతాయని భక్తూల విశ్వాసము మరియూ నా స్వానుభవము పలివేల గ్రామము పవిత్ర కౌశికాతీర గ్రామం.

Sri Uma Koppeswara Swamy palivela

 

Address :

Execuitive Officer

Sri Umakoppeswara Swamy Temple, Palivela,
Kothapeta Mandal,
East Godavari District.
Palivela- 533 229
Phone: 08855 – 243316.