సిఎం చంద్రబాబు జూన్‌ 5న అమలాపురం రాక

కోనసీమటుడే : సిఎం చంద్రబాబు జూన్‌ 5న అమలాపురంలో నవ నిర్మాణ దీక్షకు వస్తున్న సందర్భంగా సిఎం పర్యటనా ఏర్పట్లను కలెక్టర్‌ కార్తికేయమిశ్రా గురువారం పరిశీలించారు.

CM Chandrababu Naidu

స్థానిక కిమ్స్‌ వైద్య కళాశాల కాన్ఫ్‌రెన్స్‌ హాల్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ వెంట స్థానిక ఎంఎల్‌ఎ అయితాబత్తుల ఆనందరావు, జెసి ఎ.మల్లిఖార్జున, రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి నిశాంత్‌ కుమార్‌, రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ తదితరులు ఉన్నారు.