మన రాజమండ్రి లో సినీతారల సందడి

కోనసీమటుడే : రాజమహేంద్రవరంలో సినీ తారలు సందడి చేశారు. స్థానిక జెఎన్‌ రోడ్డు రామాలయం సెంటర్‌లో కెఎల్‌ఎం ఫ్యాషన్‌ మాల్‌ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి హీరో సాయిధరమ్‌తేజ్‌, హీరోయిన్‌ కేథరిన్‌ హాజరయ్యారు. రిబ్బన్‌ను కట్‌ చేసి మాల్‌ను ప్రారంబించారు.

KLM Fashion Shopping Mall opening

వీరిని చూసేందుకు అభిమానులు షాపింగ్‌ మాల్‌ వద్దకు భారీగా తరలివచ్చారు. వారితో సాయిధరమ్‌తేజ్‌ సెల్ఫీలుదిగి సందడి చేశారు. షాపింగ్‌మాల్‌ను సందర్శించారు. అధునాతన భవనంలో వివిధ ఫ్లోర్‌లలో నేటి యవతను ఆక్టుకునే డిజైన్లతో కెఎల్‌ఎం ఫ్యాషన్‌ మాల్‌ను రూపుదిద్దుకుందన్నారు. అనంతరం సాయిధరమ్‌ తేజ్‌ మీడియాతో మాట్లాడారు.  పలువురు నగర ప్రముఖులు ఈ మాల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.