వాడపల్లి ఆలయాభివృద్ధికి చర్యలు – నాలుగు రాజగోపురాలతో ప్రాకారమండపం

నిత్యం భక్తుల తాకిడితో శోభిల్లుతున్న వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి నూతన శోభ

 

development of Vadapalli Sri Venkateswara Swamy Temple

వివిధ అభివృద్ధి పనులు చేసేందుకు దేవాదాయ ధర్మదాయశాఖాధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశారు. తూర్పు గాలిగోపురానికి అదనంగా రూ.2.70 కోట్లతో ఉత్తర, దక్షిణ, పడమర దిక్కుల్లోనూ అయిదంతస్తుల గాలిగోపురాలతో కూడిన ప్రాకార మండపం నిర్మించనున్నారు.

ఆలయం సమీపంలోని పార్కింగ్‌ స్థలం వద్ద రూ.40 లక్షలతో కొత్త శౌచాలయం, గోదావరి ఒడ్డున రూ.30 లక్షలతో కేశఖండనశాల ఏర్పాటు, ఆలయ ఆవరణలో రూ.70 లక్షలతో గ్రానైట్‌తో అభివృద్ధి చేయనున్నారు.

శుక్రవారం డీఈ దుర్గేష్‌, ఏఈ కృష్ణంరాజు, స్థపతి శ్రీనివాసాచార్యులు పాలకమండలి సభ్యులు, ఈవో సత్యనారాయణరాజుతో చర్చించారు. అభివృద్ధి చేయనున్న ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.