అంబాజీపేట మార్కెట్‌ యార్డులº అగ్నిప్రమాదం

అంబాజీపేట, కోనసీమటుడే : స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని కురిడీ కొబ్బరి కాయల గోదాములో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్తు షార్టు సర్క్యూటే ఇందుకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

 

Fire Accident in Coconut Market Yard at Ambajipeta

Fire Accident in Coconut Market Yard at Ambajipeta

ఈ సంఘటనలో రూ.1.50 కోట్ల మేర ఆస్తినష్టం జరిగిందని అధికారులు ప్రాథ]మికంగా అంచనా వేశారు.  దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మార్కెట్‌ యార్డులోని కొబ్బరి గోదాములో అంబాజీపేటకు చెందిన అప్పన వెంకట్రాజు అండ్‌ బ్రదర్స్‌ కంపెనీ యాజమాని అప్పన వెంకట్రాజు భారీగా కురిడీ కొబ్బరి కాయలను నిల్వ చేశారు. అయితే మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో గోదాములోని కురిడీ కొబ్బరి కాయలు, కొబ్బరి కాయలను ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన సంచులు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయింది. గోదాము కూడా దెబ్బతింది. అమలాపురం, కొత్తపేట కేంద్రాల నుంచి వచ్చిన అగ్నిమాపక అధికారులు, సిబ్బంది అయిదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అమలాపురం ఆర్డీవో బి.వి.రమణ, ఏఎంసీ ఛైర్మన్‌ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో బి.వి.రమణ అధికారులను ఆదేశించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై కె.వి.నాగార్జున తెలిపారు.

Source : Eenadu