కోనసీమ లో సినీనటి ఆమని సందడి

heroine amani visit konaseema

heroine amani visit konaseema

కోనసీమటుడే తాపేశ్వరం: సినీ నటి ఆమని మండలంలోని తాపేశ్వరం గ్రామంలో గల సురుచి ఫుడ్స్‌లో మంగళవారం సందడి చేసింది. కాజా తయారీ విధానాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆమె రాకతో సురిచిలో సందడి నెలకొంది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి కనబర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నక్కిన త్రినాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా ‘హలో గురూ ప్రేమ కోసం’ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ సరసన నటిస్తున్నానని తెలిపారు. నాలుగు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందన్నారు. మంగళవారం ద్రాక్షారామలోని షూటింగ్‌ పూర్తి చేసుకుని రాజమహేంద్రవరం వెళ్తూ తనకిష్టమైన సురుచిని సందర్శించానన్నారు. అనంతరం సురుచి పిఆర్‌ఒ వర్మ ఆమెకు బాహుబలి కాజాను అందించారు. ఈ కార్యక్రమంలో సురుచి జిఎం శంకర్‌, మల్లి పాల్గొన్నారు.