వాడపల్లి వెంకన్నకు మరకతమణి బహూకరణ

కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారికి సోమవారం దాతలు మరకతమణిని బహూకరించారు.

కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సోమవారం దాతలు మరకతమణిని బహూకరించారు. రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల ప్లాస్టిక్స్ అధినేత సోమిరెడ్డి వంశీకృష్ణ కుటుంబ సభ్యులు 112 గ్రాముల బంగారు గొలుసుతో కూడిన *మరకతమణి* హారాన్ని శ్రీస్వామి వారికి సమర్పించారు.

marakathamani haram presentation to vadapalli venkanna

marakathamani haram presentation to vadapalli venkanna

బంగారం విలువ రూ.3లక్షలు,మరకతమణి విలువ రూ.4.5 లక్షలు వెరసి ఈ ఆభరణం విలువ రూ.7.5 లక్షలు ఉంటుందని దాత తెలిపారు.ఆలయ ఛైర్మన్ కరుటూరి నరసింహారావు, ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం ఈవో దాతలకు స్వామి వారి చిత్రపటం అందజేసి అభినందించారు..