ముక్కామల ఫెమస్ అబ్బిరెడ్డి వారి దిబ్బ రొట్టి

అబ్బిరెడ్డి వారి దిబ్బ రొట్టి అఘాధ జలనిధిలో ఆణిముత్యం ఉన్నట్లే

 

#ముక్కామల లో ఒక మూల వ్యాపార కూడలి కాని చోట కాలువ గట్టు.కాలువలో కూలి పోతుందేమో ననే పాక. అదే అబ్బిరెడ్డి సత్యనారాయణ కాకా హోటల్.

సాయంకాలం మూడు గంటల నుండి రాత్రి 9వరకూ ఇక్కడ కమ్మటి మినపరొట్టి తయారు చేసి వినియోగ దారులకు అమ్మే పల్లె హోటల్.

ఈ రొట్టె కోసం రోజూ 20 కిలో మీటర్ల దూరం నుండి వస్తారు. నిప్పుల పొయ్యపైన మట్టి మూకిటిలో రొట్టి పిండి వేసి దానిపై మరో మూకిటి పెట్టి పైన కూడా బొగ్గుల మంట పెట్టి నూనె వేయకుండా తమాషాగా రొట్టి ని కాలుస్తాడు అబ్బిరెడ్డి.

ఘుమ ఘుమ ల రొట్టి దానిలో బహు రుచికరమైన శనగ చట్నీ ,ఓహ్ ఏమి రుచిఏమిరుచి అంటూ  అబ్బిరెడ్డి మరో కొంచం చట్నీ వెయ్యి అంటూ నోట లొట్టలు వేస్తూ మినపరొట్టి తింటూ ఉంటారు.