రాజోలు ఆర్టీసీ డిపోకు చెందిన నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌

రాజోలు, కోనసీమటుడే : బస్సులో ఎవరో ప్రయాణికుడు మరిచిపోయిన రూ. లక్ష నగదున్న బ్యాగును భద్రంగా డిపో మేనేజరుకు అందజేయడం ద్వారా తన నిజాయతీని నిరూపించుకున్నాడు రాజోలు ఆర్టీసీ డిపోకు చెందిన ఓ కండక్టర్‌.
RTC conductor who is honest with the Razole RTC Depot

RTC conductor who is honest with the Razole RTC Depot

ఈ సంఘటనకు సంబంధించి డీఎం ఎం.యు.వి.మనోహర్‌ శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 7న రాజోలు నుంచి రాజమహేంద్రవరం వెళ్లిన ఏపీ29 జెడ్‌0194 బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వర్తించిన పి.వెంకన్నబాబుకు బస్సులో ఎవరో ప్రయాణికుడు బ్యాగు మరిచిపోయినట్లు గుర్తించాడు. దానిని భద్రంగా డిపో మేనేజర్‌కు అందజేశారు. అందులో రూ.1,07,900 నగదు, దుస్తులు ఉన్నాయి. ఈ సందర్భంగా నిజాయతీ కనబరిచిన కండక్టర్‌ వెంకన్నబాబు, అదే సర్వీసులో విధులు నిర్వర్తించిన డ్రైవర్‌ ఆర్‌.చిన్నవాడులను డీఎం అభినందించారు. కార్మికులంతా వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బ్యాగు పోగొట్టుకున్న ప్రయాణికుడు టిక్కెట్టు వెంట తీసుకుని వచ్చి డిపోలో సంప్రదిస్తే నిర్ధారణ చేసుకుని బ్యాగు అప్పగిస్తామని డీఎం తెలిపారు.

Source : eenadu