వాడపల్లి బ్రహ్మాండనాయకునికి నీరా‘జనం’

కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు.

( Vadapalli Sri Venkateswara Swamy Temple )

development of Vadapalli Sri Venkateswara Swamy Temple

ఆత్రేయపురం, కోనసీమటుడే:  ఏడు వారాల నోము ఆచరించే వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడింది. గోవింద నామాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్ర పుష్పం, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకులు శాస్త్రీయంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. రావులపాలెం, ఏలేశ్వరం, గోకవరం తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి, ఉమాకమండలేశ్వరస్వామి, ఆత్రేయపురంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాలు కూడా భక్తులతో శోభిల్లాయి. దేవస్థాన పాలక మండలి ఛైర్మన్‌ కరుటూరి నరసింహారావు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, సభ్యులు ఏపుగంటి వెంకన్న, పడాల పద్మావతి, వేగేశ్న లక్ష్మీపతిరాజు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.