ఆదుర్రు – గోదావరి ఒడ్డున అత్యంత విలువైన బౌధ్ధ స్థూపం

గోదావరి తీరన బౌధ్ధ మతానికి చెందిన అత్యంత విలువైన నిర్మాణాలు

Buddhist site in Razole taluk of East Godavari district of Andhra Pradesh

తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు తాలూకాలో ఉన్న ఆదుర్రు గ్రామం అతి నిశ్శబ్దంగా కనిపిస్తుంది. అక్కడ బౌధ్ధ మతానికి చెందిన అత్యంత విలువైన నిర్మాణాలున్నాయని ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది.  అది పదిహేడు అడుగుల వ్యాసం కలిగి జెయింట్ వీల్ ఆకారంలో నిర్మించబడింది. చుట్టూ వేదిక, ఆయకాలు నిర్మించబడి ఉన్నాయి. దీనిని మహాక్షేత్రం అంటారు.

Buddhist site in Razole taluk of East Godavari district of Andhra Pradesh

ఆదుర్రు ను ‘దుబరాజు దిబ్బ’ లేదా ‘దుబరాజు గుడి’ అని కూడా అక్కడి వారు పిలుస్తారు.ఇది గోదావరి నదికి ఉపనది అయిన వైనతేయ నదికి పశ్చిమంగా ఉంది. మామిడికుదురు లోని బంగాళాఖాతానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది. 

ఇక్కడ బౌధ్ధ మతానికి చెందిన అతి ముఖ్యమైన మూలాలు ఉన్నాయి. ప్రపంచంలోని మూడు ప్రఖ్యాత స్థూపాల్లో మొదటిది ఆదుర్రులో ఉంది. రెండవది రాంచీలో, మూడవది సారనాధ్ లో ఉన్నాయి.

Buddhist site in Razole taluk of Konaseema

ఇక్కడి మహాస్థూపం అశోకుడి కాలంలో నిర్మించబడింది.అశోకుని కుమార్తె సంఘమిత్ర శ్రీలంక కు వెళ్తూ ఇక్కడ ఈ స్థూపానికి శంకుస్థాపన చేసింది.

ప్రభుత్వం వారు ఈ విలువైన నిర్మాణాల యొక్క సంరక్షణ బాధ్యత తీసుకోక పోవటంతో ఆదుర్రుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులు బుధ్ధ విహార ట్రస్ట్ ను ఒకదానిని ఏర్పాటు చేసి ఇక్కడి బౌధ్ధ స్థూపాన్ని, మిగిలిన విలువైన అవశేషాల్ని సంరక్షిస్తున్నారు.ఇది 2400 సంవత్సరాల నాటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్థలం అని చెబుతారు.

చక్రవర్తి కుమార్తె సంఘ మిత్ర తన తండ్రి చేసిన కళింగ యుద్దం లో జరిగిన రక్త పాత0 చూసి చలించి పోయి భౌద్ధ మతం స్వీకారం చేసి ,మత ప్రచారం కొరకు శ్రీ లంక వెళుతూ ,ఈ ప్రాంత ప్రక్రుతి అందాల కు ముగ్ధులైన ఆమె ఆదుర్రులో గోదావరి నదీ గట్టు ప్రక్కన అతి సుందర భౌ ద్ధా రామం నిర్మించ తలపెట్టిన దట, నిర్మాణం లో ఉండగానే మహమ్మదీయులు వీరి పైన దాడిచేయ గా రక్త పాత0 ఇస్టం లేని సంఘ మిత్ర అచట నుండి శ్రీ లంక వెళ్ళి పోయిన దట ఈ ఆరామము కాల క్రమం లో గోదావరి నదీ పాతము వలన మట్టి క్రింద ఉండి పోయి సుమారు మూడు వందల సంవత్సరము ల క్రితం వరదల అనంతరం బయట పాడగా ధూ ప రాజు దిబ్బగా పిలవ బడి అమ్నవారి క్షేత్రం గా కొంత కాలం పూజించబడి కొన్ని దశాబ్దాల కృతం ప్రభుత్వ ఆర్కియాలజీ శాఖ వారి ఆధీనంలో పరిశీలనలు జరిపి భౌధా రామం గా ప్రభుత్వం చే గుర్తింపబడి నిర్వహి0చ బడుచున్నది .

Sanghmitra, Ashoka’s daughter

 

రాజమండ్రి నుండి రాజోలు రోడ్డు మార్గం లో వచ్చి అక్కడి నుండి ఆదుర్రు వరకు ఆ సన్నని రోడ్లపైన ప్రయాణం ఒక చిక్కని అడవిలోకి వెళ్తున్నట్టు ఉంటుంది.చుట్టూ కళ్లు తిప్ప్పుకోనివ్వని ఆకుపచ్చని వనాలు మనసును సేదదీరుస్తాయి. ఊరంతా కూడా చుట్టూ పచ్చని పొలాలతో, రొయ్యల చెరువులతో చూడ ముచ్చటగా ఉంటుంది. డాక్టర్ సదుపాయం లాటివి ఈ గ్రామంలో లేవనే చెప్పారు.

అంతా తిరిగి చూడ్డండి.ఆ భౌద్ధ స్థూపం చుట్టూ తిరిగి రండి ఇక్కడ చతురంగా ఉన్న ఇటుక ల పునాదులలా ఉన్న కట్టడం జ్ఞాన మందిరం మరియూ ధ్యాన మందిరం అక్కడ కాసేపు మీరు కూర్చోండి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి

బౌద్ధ పర్యాటక కేంద్రం #ఆదుర్రు ను మరింత పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దటానికి నూతనం గా #ఆంధ్రప్రదేశ్#టూరిజం బోర్డ్ నిర్మించిన #APTDC

 

 

బుద్ద0 శరణం గఛామి.. సంఘం శరణం గఛామి.. ధర్మం శరణం గఛామి..